KTR : పదేండ్ల నిజమైన కేసీఆర్ పాలనకు, పదేండ్ల విషం బీజేపీ పాలన, 150 రోజుల అబద్దం కాంగ్రెస్ రేవంత్ పాలనల మధ్య పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్ లో శనివారం నిర్వహించిన కోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. గత ఐదేళ్లలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గల్లీలోగానీ, ఢిల్లీలోగానీ కనిపించారా? కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల తరపున పార్టమెంట్ లో వినోద్ గళం విప్పారని గుర్తు చేశారు.
‘‘పోరాడే వ్యక్తులే పార్లమెంట్ కు రావాలి. కేంద్రం నిధులు రాబట్టే సత్తా వినోద్ కు ఉంది. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై 34 శాతం ధరలు పెంచారు. ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.