BRS Vs Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ.. గెలుపుపై ఎవరి లెక్కలు వారివి..

BRS Vs Congress

BRS Vs Congress

BRS Vs Congress : తెలంగాణ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారుకాగా, నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఇక సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తి కానుండగా, బుధవారం ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని అనుకుంటున్న సమయంలో బీజేపీ కూడా తాజా హామీలతో మెల్లగా రేసులోకి దూసుకొస్తున్నది. బీఆర్ఎస్ కు కంచుకోటలాంటి నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టగా, కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు ఉన్నచోట పక్కా వ్యూహంతో గులాబీ పార్టీ ముందుకెళ్తున్నది.

అయితే అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తలో దిక్కు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోసారి సెంటిమెంట్ అస్ర్తాన్ని వాడుతూనే పదేళ్లలో అందించిన పథకాలను ప్రచారం చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలను వివరిస్తున్నారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేవలం కాంగ్రెస్ ను మాత్రమే ఈసారి గులాబీ పార్టీ టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నది.

మరోవైపు అధికార బీఆర్ఎస్ కు దీటుగా కాంగ్రెస్ అస్ర్తాలను సంధిస్తున్నది. ఇప్పటివరకు గ్రౌండ్ లెవల్ టాక్ మొత్తం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ఇక అగ్రనేత రాహుల్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇక కామారెడ్డిలో నేరుగా సీఎం కేసీఆర్ నే రేవంత్ రెడ్డి ఢీకొట్టబోతున్నారు. ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇక్కడ బీఆర్ఎస్ ను దెబ్బతీస్తే అధికార పీఠం చేజిక్కించుకోవచ్చునని అంతా అనుకుంటున్నారు.

ఇక ఈ రేసులోకి బీజేపీ దూసుకొచ్చే ప్రయత్నం ఆలస్యంగా మొదలుపెట్టింది  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను దెబ్బతీసేలా ఇప్పటికే పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. బీసీ నినాదంతో పాటు ఎస్సీ వర్గీకరణపై దృష్టి పెడుతామని చెప్పింది. ఏదేమైనా ప్రతి సీటులో హోరాహోరీ అనేలా పోటీ జరగబోతున్నది.

TAGS