Minister Achchennaidu : పంట నష్టపోయిన రైతులందరికి పరిహారం అందిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు

Minister Achchennaidu
Minister Achchennaidu : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. కరవు పీడిత మండలాల అంశంపై శాసన మండలిలో సభ్యులకు మంత్రి జవాబిచ్చారు. అక్టోబరు 29న 5 జిల్లాల్లోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పటి వరకు 1,06 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు పంట నష్టపోయినట్లు తేలిందన్నారు. అందుకు రూ.159.20 కోట్ల నిధులు మంజూరు చేశామని, త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు. 28వ తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరదల్లో నష్టపోయిన రైతుల ఖాతాల్లో 20 రోజుల్లోనే నష్టపరిహారాన్ని జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 80 శాతం కౌలు రైతులకు నేరుగా ప్రభుత్వం పరిహారం ఇచ్చిందన్నారు.