Work From Home : కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రం హోం ట్రెండ్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పలు సమస్యలు పెరిగిపోతున్నాయి. సంస్థలు వర్క్ ఫ్రం హోం అవకాశాలు ఇచ్చాయి. కానీ వాటి వల్ల కలిగే పర్యవసానాలను లెక్కలోకి తీసుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
ఐటీ దిగ్గజం టీపీఎస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి చివరి నాటికి ఉద్యోగులు కార్యాలయాలకు రాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. చేసే ఉద్యోగం పోతే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కార్యాలయాలకు వెళితేనే మనుగడ ఉంటుందని భావించుకుంటున్నారు.
వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, సంస్థలకు తిప్పలు తప్పడం లేదు. సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని చెబుతున్నాయి. దీని వల్ల కలిగే పర్యవసానాల వల్ల ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇక మీదట వారు కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
ఆఫీసులకు రాకపోతే వారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు రూపొందించబడ్డాయి. కంపెనీ రూల్స్ ప్రకారం ఉద్యోగులు ఆఫీసుల్లోనే పని చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆఫీసు వేళల్లోనే. ఎప్పుడు పడితే అప్పుడు పని చేసే వీలుండదు. ఐటీ ఉద్యోగులకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.