Guntur News : గుంటూరు నగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి, కమిషనర్లు, ప్రజల బలి అవుతున్నారు. మున్సిపల్ గత కమిషనర్ నాగలక్ష్మి, నేడు కీర్తి ఫై కింద స్థాయి అధికారులు బలవు తున్నారు.. ఓ బిల్డింగ్ నిమిత్తం తప్పుడు పత్రాలతో క్రింద స్థాయి అధికారులు పరిమిషన్ ఇవ్వడంతో అప్పటి నగర కమిషనర్ నాగలక్ష్మి బలయ్యారు..
నేడు అదే స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. ఐఏఎస్ అధికారి కీర్తి దగ్గర ఆటలు సగకపోవడంతో కిందస్థాయి అధికారులు తు తు మాత్రంగానే చేతులు దులు పుకు న్నారు. సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం తవ్విన మంచి నీటి పైపులను గాలికి వదిలి వెయ్యటంతో మురికి నీరు ఏర్పడి ఐదుగురు ప్రాణాలు విడిచారు..
కేవలం కమిషన్ కు కక్కుర్తి పడి మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ప్రోత్బలంతో బలవుతున్న ప్రజలు.. ఇకనైనా అధికారులలు కళ్ళు తెరిచి ప్రజలకు మెరుగైన పాలనా, మరియు మంచినీరు ఇవ్వాలని కోరుతున్నారు..