Raveena Tandon : 50వ పడిలోకి వస్తున్నా.. అంతే ఫిక్, అంతే అందం.. రవీనా ఆరోగ్య రసహ్యం ఏంటంటే?

Raveena Tandon Latest pics
Raveena Tandon : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేదని పేరు రవీనా టాండన్. బాలీవుడ్ డైరెక్టర్ రవి టాండన్ కుమార్తెనే రవీనా టాండన్. పత్తర్ కే ఫూల్ ద్వారా 1991లో తెరంగేట్రం చేశారు రవీనా. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అనేక చిత్రాలు, వెబ్ సిలీస్ చేసింది. ఆమె కళారంగానికి చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.
ప్రస్తుతం రవీనా టాండన్ వయస్సు 49 అంటే ఎవరూ నమ్మరు. అవునండీ 50 కేవలం సంవత్సరం దూరంలోనే ఉంది. ఇప్పటికీ మచ్చలేని చర్మం, చక్కటి టోన్డ్ బాడీతో ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. 90’s, 2000 దశకాల్లో డార్లింగ్ గా ఒక వెలుగు వెలిగిన రవీనా టాండన్ ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. సినిమా మొత్తం పరిశీలిస్తే ఆమె ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతంత మాత్రంగానే ఉంది.
20, 30 ఏళ్ల వయసున్న మహిళలతో అప్రయత్నంగా పోటీ పడుతూ తన సన్నని, మనోహరమైన ఫిగర్ తో ఇటీవల ఒక ఫొటోషూట్ లో మెరిసింది. ఇప్పుడు ఆమెకు కావలసిందల్లా 40 ఏళ్ల వయసులో ఉన్న గ్లామరస్ లేడీగా నటించడానికి ఆసక్తి చూపుతున్న సినీ దర్శకులు.
అందుకే ఇప్పటికీ తను బ్యూటిఫుల్ అండ్ ఫిట్ అని నిరూపించుకునేందుకు ఫ్యాషన్ ఫొటోలు దిగి మరీ ఇన్ స్టాలో షేర్ చేస్తుంది. తన అందంతో మెప్పించి, తన నటనా కౌశలంతో ప్రశంసలు అందుకోవాలనే ఆకర్షణ ఆమె సొంతం.
View this post on Instagram