JAISW News Telugu

YCP : కామెడీ షోలా.. రోజుకో ఎపీసోడ్.. వైసీపీ తీరుపై ప్రజల ఆగ్రహం..

YCP

YCP Ravindranath Reddy

YCP : ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు.. తమను ఎవరు పాలించాలో నిర్ణయించుకోవడంలో విఘ్నులు. ఎవరిని గద్దెనెక్కిస్తారో.. ఎవరిని గద్దె దించుతారో వారి ఇష్టం. 2019లో ‘ఒక్క అవకాశం’ అన్న జగన్ ను గద్దెనెక్కించిన ప్రజలు, ఐదేళ్లు కష్టపడ్డామని గ్రహించి గద్దె దించారు. మళ్లీ తమ నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. కానీ ప్రజల తీర్పును వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఓటమి పాలైన జూన్ 4వ వేతీ నుంచి రోజుకో విషయాన్ని సొంత సోషల్ మీడియాలో పెడుతూ మరింత చీత్కారాన్ని ఎదుర్కొంటుంది.

ఇటీవల వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి (వైఎస్ జగన్ మేనమామ) హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని చెప్పడం చూస్తే జనం నవ్వుకుంటున్నారు. బార్ కోడ్ లను ఉపయోగించి సింగపూర్ నుంచి ఓట్లను తారుమారు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ‘పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు సింగపూర్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడు. కేవలం బార్ కోడ్ ను మార్చితే చాలు ఓట్లన్నీ తన వేపునకు వెళ్లిపోతాయి. ఆ ఓట్లు ప్రజల నుంచి వచ్చినవి కావు, సాంకేతికత ఉపయోగించి చంద్రబాబు నాయుడు సృష్టించాడు’ అని అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై తాము మరింత పోరాడుతామని అన్న రవీంద్రనాథ్ రెడ్డి దీనిపై  న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పరు.

రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ వాదనలను ఎవరైనా ఎలా పరిగణిస్తారో చూడడం కష్టం. జబర్ధస్త్ జోకుల కంటే వైసీపీ నేతల వ్యాఖ్యలే బెటర్ అని జనాలు అనుకుంటున్నారు. 2019 లో వందకు పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ ఇప్పుడు 11కు పరిమితమైంది. ఇంత అవమానకరమైన ఓటమి సరిపోదన్నట్లుగా వైసీపీ నేతలు వెర్రి మాటలతో ట్రోల్ కు గురవుతున్నారు.

Exit mobile version