Comedian Santhanam : కోట్ల రూపాయిలు అప్పుల పాలయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్ సంతానం!

Comedian Santhanam

Comedian Santhanam

Comedian Santhanam : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ కమెడియన్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో సాంతం పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఈయన ఇప్పటి వరకు ఎలాంటి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించలేదు కానీ, డబ్బింగ్ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ ని సంపాదించాడు. ఈయన కామెడీ టైమింగ్ కి ఎలాంటి వాడికైనా పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ముఖ్యంగా ప్రముఖ తమిళ హీరో ఆర్య సినిమాల్లో ఇతని కామెడీ అదిరిపోతుంది.

వీళ్ళ కాంబినేషన్ లో పండే హాస్యం కి తిరుగేలేదు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వడం తో అప్పట్లో ఆర్య తన ప్రతీ సినిమాలోనూ సంతానం ని కమెడియన్ గా పెట్టుకునే వాడు. అతని డేట్స్ కష్టమైతే సినిమా షెడ్యూల్స్ ని నిర్మాతలతో చెప్పి వాయిదా వేయించేవాడు కానీ,  కచ్చితంగా అతను నా సినిమాలోనే ఉండాలని పట్టుబట్టేవాడట ఆర్య ఆరోజుల్లో. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘నేనే అంబానీ’, ‘రాజా రాణి’ సినిమాలు అంటే తెలుగు ఆడియన్స్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అలాంటి ఈ కాంబినేషన్ ని తమిళ ఆడియన్స్ తో పాటుగా, తెలుగు ఆడియన్స్ కూడా బాగా మిస్ అవుతున్నారు. అందుకు కారణం సంతానం ఈమధ్య కామెడీ రోల్స్ కి టాటా చెప్పి హీరో రోల్స్ మాత్రమే చేస్తూ ఉండడం. 2017 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆయన హీరో గానే కొనసాగుతున్నాడు.  కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా. కొన్ని చిత్రాలకు ఆయన స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇకపోతే రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన చిత్రం ‘వడక్కుపట్టి రామస్వామి’. కార్తీక్ యోగి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా  ఫిబ్రవరి రెండవ తారీఖున విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేసారు.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆర్య ముఖ్య అతిథి గా విచ్చేశాడు. ఆయన గురించి హీరో సంతానం మాట్లాడుతూ ‘నేను ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను ఆర్య గురించి అడుగుతూ ఉంటారు. ఆర్య ని కూడా అందరూ తన వద్ద నా గురించి అడుగుతూ ఉంటారు. మా ఇద్దరి మధ్య అంత స్నేహం ఉంది. స్నేహం తో పాటుగా ఇద్దరం కలిసి కోట్ల రూపాయిలు అప్పుల పాలయ్యాం కూడా’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

TAGS