Jagan – KCR Trolls : రా తమ్ముడు.. నువ్వు వస్తావని ముందే తెలుసు..!

Jagan - KCR Trolls

Jagan – KCR Trolls

Jagan – KCR Trolls : పాలన జనరంజకంగా ఉంటే పాలకులను అదే జనం గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఏదో పీఠం ఎక్కించారు కదా.. మనం ఏది చేస్తే అది చెల్లుతుందని విర్రవీగితే ఇలాంటి గతే పడుతుంది. ఇంతకీ ఎవరికి ఆ గతి పట్టింది..? వారెవరు అనుకుంటున్నారా? ఇప్పటికే తెలిసిందనుకుంటా.. రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలే వారు. ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమాన్ని పీక్ కు తీసుకెళ్లారు. పార్టీ పెట్టి ఇది కేవలం ఉద్యమం పార్టీ అని చెప్పి ఆ తర్వాత రాజకీయ పార్టీ చేశాడు.. ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. అది కూడా రెండు సార్లు ఇది అందరికీ తెలిసిందే. అయితే నేను తప్ప మరో నాయకుడు తెలంగాణ లో లేడని, ఏ పార్టీ తన పార్టీతోని ఢీ కొట్టలేదని అహం పెరిగి పాలనను ఫాం హౌజ్ కే పరిమితం చేశాడు. ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అదే ఫాంహౌజ్ కు పరిమితం చేశారు.

ఇక, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుంటే.. 2014లో చంద్రబాబు హయాంలో రాష్ట్రం బాగానే డెవలప్ అవుతున్నా.. పాదయాత్ర.., ఒక్క ఛాన్స్ అంటూ జగన్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం.. యంగ్ లీడర్ కదా అని ప్రజలు 2019లో పట్టం కట్టారు. ఇక అప్పటి నుంచి సారు కాలు నేలమీద లేదు. జనం సొమ్ముతో విలాసాలు, రుషికొండ లాంటి నిర్మాణాలు.. ఇలా ప్రజలను అప్పులు పాలు చేశాడు. పైగా ఆయన తెచ్చిన పథకాలు కూడా అర్థం పర్థం లేనివిగా ఉన్నాయని ఆయనకు 2024లో వచ్చిన సీట్లను చూస్తే తెలుస్తుంది. ప్రజలు తీవ్ర ఆగ్రహం మీద ఉన్నారని చెప్పకనే చెప్పారు.

ఈ ఇద్దరు మాజీ సీఎంల గురించి సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కేసీఆర్ జగన్ కు స్వీటు తినిపించే ఫొటోను ట్రోల్ చేస్తూ ఇద్దరం ఒకటే అంటూ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకునే వారు కొందరుంటే అయ్యో పాపం అనుకునే వారు మరికొందరు. 

TAGS