JAISW News Telugu

YS Jagan : పులివెందుల పేదోడి మహా నగర ‘గుడిసెలు’ చూద్దాం రారండి..

YS Jagan

YS Jagan

YS Jagan : ఓ రాజ్యంలో పేదలు లేకుండా చేస్తామని ఓ ‘పేద’ మహారాజు కంకణం కట్టుకున్నాడు. పాపం ఆ రాజ్యం పేదదే.. దానికి ఇప్పటివరకూ ఓ రాజధాని కూడా లేదు. కానీ ఆ మహారాజు పాలన చేయాలి కాబట్టి తను ఉండడానికి ఓ ‘గుడిసె’ వేసుకున్నాడు. ఎప్పుడన్నా పొరుగు రాజ్యాలకు పోతే అక్కడ ఉండడానికి అక్కడక్కడ కూడా ‘గుడిసెలు’ వేసుకున్నాడు. తాను పేదవాడినని, తాను ఎప్పుడూ పేదల పక్షమేనని ఆయన అంటుంటాడు. రాజ్యంలో ఎప్పుడూ ‘పేదలు’ ఉండాలనే ఆయన సదా కోరుకుంటాడు. ఎందుకంటే ఆ పేదలే కదా ఆయన్ను మరోసారి రాజును చేసేది. ఇలాంటి కథ ఉన్న వీడియోనే ఇటీవల బాగా వైరల్ అవుతోంది. ఇది ఏపీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఎవరూ తయారు చేశారోగాని వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటే నమ్మండి. ఆ స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది. నూరు శాతం నిజాలతో ఎలాంటి అవహేళనలు, వ్యక్తిగతహననాలు లేకుండా ఉంది. ఆ వీడియోలోని సారాంశం ఇలా ఉంది..

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో 52,263 చదరపు అడుగుల స్థలంలో ఈ పులివెందుల పేదోడు ఐదంతస్తుల బుల్లి గుడిసెను వేసుకున్నాడు. ఈ బుల్లి గుడిసె ప్లాన్ లో మూడంతస్తుల అండర్ గ్రౌండ్ కారు పార్కింగ్, అంతేనా అనేక ఎస్కలేటర్లు, లిఫ్ట్ లు, 200మంది నిరుపేదలు కూర్చుని చూసే ఓ బుల్లి థియేటర్, ఈ కూటికి గతిలేని బిడ్డకు ఆ గుడిసెలో లైబ్రరీ, స్క్వాష్, టెన్నిస్, వాలీబాల్ మైదానాలు, జిమ్ లు ఉన్నాయి. వీటిని ప్రత్యర్థులు అక్రమ ఆస్తులు అంటూ  విష ప్రచారం చేస్తే వాటికి కౌంటర్ గా ఈ బిడ్డ ‘ పేదవాడికి ఆడుకోవడానికి హక్కు లేదా ?’’  అని అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంకా ఈ గుడిసెను కట్టడానికి రాజస్థాన్ నుంచి పాలరాయి తెప్పించాడు.

ఈ పులివెందుల పేదోడి గుడిసెలో 60గదులు, ఒక్కో బాత్ రూం సింగిల్ బెడ్రూం అంత పెద్దదిగా పాలరాయితో నిర్మించకున్నాడు. ఒక పేదవాడి బాత్ రూం కూడా ఉండకూడదా? అని ఈ బిడ్డ ఆవేదన.  ఈ ప్యాలెస్ నే లోటస్ పాండ్ ప్యాలెస్ అంటారు.

ఈ పేద బిడ్డకు ఆఫీస్ కాంప్లెక్స్,20  సర్వెంట్స్ క్వార్టర్స్, పెరట్లో రెండంతస్తుల అవుట్ హౌజ్ తో పాటు 30 బెడ్రూంలు ఉన్నాయి. ఈ పేదవాడి గుడిసె విలువ రూ.1000 కోట్లు అని అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఇలా ఈ పేద మహారాజు గుడిసెల కథ ఎన్నన్ని చెప్పమంటారు. హైదరాబాద్ లోనే కాదు బెంగళూరులో అయితే ఇంతకంటే పెద్ద గుడిసెనే కట్టుకున్నాడు పాపం ఈ పేద బిడ్డ. పేదవాడు ఇలా గుడిసెల కట్టుకుంటే తప్పంటారా? అధ్యక్షా..!

Exit mobile version