Collect Oil This is India : చూడు మల్లేశో చూడు మల్లేశో దేశం ఎటు పోతోందో కనరా మల్లేశో అన్నారో సినీకవి. దేశం ముందుకు పోతోందని పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతూనే ఉన్నారు. వాస్తవంగా చూస్తే ఇంకా పేదరికం మనదేశంలో వేళ్లూనుకుంటూనే ఉంది. చిన్నారుల నుంచి పండు ముసలి వరకు పట్టెడన్నం వరకు పాట్లు పడాల్సిందే. తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు అహోరాత్రులు శ్రమించాల్సిందే.
ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో దేవాలయంలో దీపాలు వెలిగించారు. అక్కడ ఆరిపోయిన దీపాల్లో నూనెను సేకరించుకుని పిల్లలు వెళ్తున్నారు. వాళ్లు దీపాలు ఆర్పడం లేదు. ఆరిన వాటిలో నుంచి నూనె తీసుకుని వెళ్తున్నారు. అన్యాయం చేయడం లేదు. అక్రమాలకు పాల్పడటం లేదు. కానీ ఇదే వారి నిత్య పనిగా మారింది. అంత కష్టపడి నూనె సేకరిస్తూ పొట్ట పోసుకోవడంతో వారికి నిరంతరం తిప్పలే.
రాజకీయ జెండాలు మారుతున్నాయి. కానీ బతుకులు మారడం లేదు. పిల్లలు చదువుకునే వయసులో ఇలా నూనె సేకరిస్తున్నారంటే వారు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతోంది. వారి పసి మనసులకు అంత పని చేయడం ఎందుకు. రెండు పూటలా నాలుగు వేళ్లు లోపలకు పోయేందుకే కదా. దేశంలో పేదరికం ఉందనడానికి ఇదే నిదర్శనం.
వారంతా ఆరిపోయిన ప్రమిదల్లో నుంచి నూనె తీసుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి హాని చేయడం లేదు. వెలిగే దీపాలను ముట్టుకోరు. ఇది వారి నిత్యం చేసే పని. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. వారి బాల్యమే ఇంత దారుణంగా ఉంటే ఇక యవ్వనం ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఇది మన దేశ చరిత్ర. మనం చూసే ఘనత.