
Ceiling
Ceiling : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్ లో పై కప్పునకు వేసిన సీలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. సెక్టార్-1 ఎస్సై సత్యనారాయణ విధులు నిర్వహించే గదిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన సమయంలో ఎస్సై సత్యనారాయన బయట వరండాలో ఉండడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. సీలింగ్ కూలిన సమయంలో గదిలో ఎవరూ లేరని ఆయన తెలిపారు.
దశాబ్దాల కిందట నిర్మించిన భవనం కావడంతో వర్షాలు పడినప్పుడు పైకప్పు లీకు అవుతుండేదని తిరువూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీలింగ్ పూర్తిగా తడిసి.. ఇప్పుడు కూలిపోయిందని చెబుతున్నారు. సీలింగ్ కూలిన సమయంలో ఎవరూ గదిలో లేకపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.