Tinmar Mallanna : కాంగ్రెస్ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండడంతో తెలంగాణలో అధికార పార్టీ ఇబ్బంది పడుతోంది. సొంత పార్టీపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారిపై పీసీసీ ఓ కన్నేసి ఉంచింది. గీత దాటినవారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా తీన్మార్ మల్లన్న హద్దు మీరి ప్రవర్తిస్తున్నట్లు టీపీసీసీ దృష్టికి వచ్చింది. ఇదే అంశాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావించినట్లు సమాచారం. తీన్మార్ మల్లన్నను సీఎం రేవంత్ రెడ్డి మందలించినట్లు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న కాకుండా, నోరు జారిన ఇతర నేతల గురించి కూడా సీఎం రేవంత్ ఆరా తీశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.