CM Review on HMDA : హెచ్ఎండీఏపై సీఎం సమీక్ష.. అధికారులపై సీరియస్
CM Review on HMDA : హెచ్ఎండీఏపై ఇవాళ రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆ విభాగం డైరెక్టర్లే లక్ష్యంగా విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం దాదాపు 50 మంది స్పెషల్ టీంతో అమీర్ పేట్ మైత్రివనం నాలుగో అంతస్తులో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో తొమ్మిదేళ్ల పాటు అనుమతులు జారీ చేసిన ఫైల్స్ పై విజిలెన్స్ ఆరా తీసినట్లు సమాచారం. ఈక్రమంలో వాటిని సీజ్ చేస్తున్నట్లు తెలస్తోంది.
హెచ్ఎండీఏ ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై విజిలెన్స్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. అరెస్ట్ వారెంట్ తో అధికారులు అక్కడికి వెళ్లడంతో ఏం జరుగబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆన్ లైన్ డేటా నుంచి చెరువుల మాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే దాడులు జరుగుతాయని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను ముందే హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాగా, అధికారులతో సమీక్షలో రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ వ్యవహారంపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని గుర్తించినట్టు, విజిలెన్స్ విచారణతో వాటిని నిగ్గుతేల్చాలని నిర్ణయించారు. ఇటీవల జరుగుతున్న సోదాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గత పదేళ్లలో భూముల అమ్మకాలపై ఆరా తీశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అన్యాక్రాంతమైన భూముల గురించి టౌన్ ప్లానింగ్ వింగ్ లో అవినీతిపై సీఎం సీరియస్ అయ్యారు.