TS Assembly:అసెంబ్లీ సమరం..రేవంత్‌రెడ్డి వర్సెస్ హరీష్‌రావు
TS Assembly:తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కూడా రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో హరీష్‌రావుపై రేవంత్‌రెడ్డి చేసి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ `హరీష్‌రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి. రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి.
గత ఐదేళ్లలో నీటి పారుదల శాఖను కేసీఆర్ కుటుంబం తప్ప మరొకరు చూడలేదు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.97,449 కోట్లు మంజూరు అయితే విడుదల చేసింది మాత్రం రూ.79,287 కోట్లు. శ్వేత పత్రంలో చూపించినవి కాకుండా గత ప్రభుత్వం చాలా నిధులు ఖర్చు చేసింది. హరీష్‌రావు సభను తప్పుదోవ పట్టించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్‌కు నిధులు వేరే వచ్చాయి.
కాళేశ్వరం నీళ్లను అమ్మేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాళేశ్వరం నీళ్లు అమ్ముతామని రూ.5,100 కోట్లు అప్పులు చేశారు. 2014కు ముందు తెలంగాణ ప్రజలు మంచినీళ్లు, ఇళ్లల్లో నల్లా కనెక్షన్లు ఉన్నట్టు గత ప్రభుత్వం చెబుతోంది. మిషన్ భగీరథపై రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందనిబ్యాంకులను మభ్యపెట్టి లోన్లు తెచ్చారు. నీళ్లపై వ్యాపారం చేసి కాళేశ్వరంపై రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథపై రూ.5వేల కోట్లు అప్పులు తెచ్చారు. TSIICకి వచ్చిన లోన్ నిధులకు ప్రభుత్వమే బాధ్యత అని గ్యారంటీ ఇచ్చారు.
అప్పుల కోసం ఆదాయం తప్పుగా చూపించింది అంటూ కాగ్ నివేదిక ఇచ్చింది. తన పద్దతి మార్చుకోవాలంటూ గత ప్రభుత్వాన్ని కాగ్ హెచ్చరించింది. శాసన సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు మాట్లాడితే చర్యలు తీసుకోవాలి` అంటూ సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీనిపై హరీష్‌రావు స్పందించారు. `నేను సభను తప్పుదోవ పట్టించలేదని, సీఎం రేవంత్ కొత్తగా సీఎం అయ్యారని, అంతా అర్థం కావాలంటే కొంత టైమ్ పడుతుందన్నారు. కాళస్త్రశ్వరం కోసం తీసుకున్న నిధులు ఒక్క కాళేశ్వరం కోసమే వాడలేదని, పాలమూరు, రంగారెడ్డితో పాటు పలు ప్రాజెక్టులకు వాడామన్నారు. మీ తెలివితేటలతో నిధులు తీసుకురండి కానీ గత ప్రభుత్వాన్ని బద్నాం చేయకండి అంటూ ఫైర్ అయ్యారు.