CM Revanth : క్యాడర్ కు రేవంత్ టాస్క్..అలా చేస్తేనే..

CM Revanth

CM Revanth

CM Revanth : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కాలం నడుస్తోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా పదేళ్ల బీజేపీ పాలనను అంతం చేసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటోంది. కానీ అదంత సులభం కాదని తెలుస్తోంది. మోదీ చరిష్మా ముందు కాంగ్రెస్ బోర్లా పడటం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

పదేళ్ల తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం రావడంతో అదే ఊపును దేశవ్యాప్తంగా తీసుకురావాలని కలలు కంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎక్కువ ఓట్లు సాధిస్తే అక్కడి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మేలో జరిగే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ లాంటి పదవులు దక్కాలంటే ఇప్పుడు కష్టపడాల్సిందేనని సూచిస్తున్నారు.

ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి అందులో సభ్యుడికి రూ. 6 వేల గౌరవ వేతనం ఇచ్చి పని చేయించుకోవాలని చూస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి చేయనున్నారని టాక్. ప్రతి 35 ఇళ్లకు ఒకరు చొప్పున సాధికార మిత్రలను నియమించేందుకు నిర్ణయించారు. వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి పార్టీని గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. బీజేపీ పాలనకు చెక్ పెట్టి కాంగ్రెస్ పాలన ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. దీని కోసం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కార్యకర్తలు ఓట్లు రాబట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెబుతున్నారు.

కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాలుస్తాయా? ఓటర్లు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. రామమందిరం ఏర్పాటుతో ఓటు బ్యాంకు పెంచుకుంది బీజేపీ. దీంతో బీజేపీ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా నిలుస్తున్నాయి.

TAGS