CM Revanth : వామ్మో రేవంత్ వ్యూహం.. కేసీఆర్ ను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాడే..

CM Revanth's strategy

CM Revanth’s strategy

CM Revanth : రేవంత్ తక్కువోడేం కాదు.. పీసీసీ చీఫ్ పదవి చేపట్టకముందు జనాల్లో ఆయన నాయకత్వంపై అనుమానాలు ఉండేవి. ఆయనపై చాలామంది తెలంగాణ వాదుల్లోనూ అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఎప్పుడైతే పీసీసీ చీఫ్ పదవి చేపట్టాడో అప్పటి నుంచి తెలంగాణ విషయంలో ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన అవలంబిస్తున్న వైఖరితో జనాల్లో సానుకూల వైఖరి ఏర్పడింది. ఇక మొన్న సీఎం అయితే కూడా రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేదు ఎలా చేస్తాడో..ఏమో అనుకున్నారు.

అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తెలంగాణ జనాల్లో కేసీఆర్ ముద్రలను తొలగించే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ‘ఓన్’ చేసుకునేలా పదునైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను ప్రజల మస్తిష్కంలో నుంచి చెరిపివేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కేసీఆర్ పక్కకు పెట్టిన ఉద్యమకారులను, నాయకులను కాంగ్రెస్ దరికి చేరుస్తున్నారు.

ఇక నిన్నటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత పాలనలోని రాచరిక పోకడలను తుడిచేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పోలికలు ఉన్నాయని గతంలోనే విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడ ఆ విగ్రహ రూపురేఖలు మార్చేయనున్నారు.

వాహన రిజిస్ట్రేషన్ల చట్టంలో కూడా మార్పు చేయనున్నారు. ‘టీఎస్’ పేరును ఇక నుంచి ‘టీజీ’గా మార్చనున్నారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన పార్టీ పేరును ప్రతిబింబించేలా ‘టీఎస్’ అని పెట్టడంపై ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇప్పుడు దాన్ని టీజీగా మార్పు చేయాలని నిర్ణయించడం గమనార్హం.

ప్రజా కవి అందెశ్రీ రాసిన ‘‘జయ జయహే తెలంగాణ’’ పాటను తెలంగాణ ఉద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించింది. పాఠశాలలు, కాలేజీల్లోరూ ప్రార్థన గీతంగా అనధికారికంగా గుర్తించేవారు. అలాగే ఏ సభ జరిగినా, ఏ దీక్ష జరిగినా..అన్నింటా ఈ పాటే జనాలను ముందుండి నడిపించింది. అలాంటి ఈ గీతాన్ని కేసీఆర్ రాష్ట్ర గీతంగా ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించారు. కనీసం అందెశ్రీకి తగిన గౌరవం కూడా ఇవ్వలేదు. అయితే రేవంత్ సర్కార్ ఈ పాటను రాష్ట్ర అధికార గీతంగా చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో అందెశ్రీకి తగిన గౌరవం దక్కినట్టైంది.

కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ పేరులో తెలంగాణను తీసేశారు. దీనికి కౌంటర్ గా రేవంత్ ..తెలంగాణలో కేసీఆర్ ముద్రలను శాశ్వతంగా తొలగించేలా వివిధ నిర్ణయాలు తీసుకోవడం, జనాలు ఆశించిన విధంగా ముందుకెళ్తుండడంతో రేవంత్ పై తెలంగాణ జనాలకు భరోసా కలుగుతోంది. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు ఉండడంతో..ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టాలని రేవంత్ చూస్తున్నారు. ఉద్యమనేతగా కేసీఆర్ ఇమేజ్ ను పూర్తిగా తుడిచిపెట్టేలా ముందుకెళ్లడం గమనార్హం.

TAGS