CM Revanth : అమిత్ షాపై డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదని, బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు ఇచ్చారని అన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపించి వేధిస్తుందన్నారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, స్టేట్ సెక్రటరీ శివకుమార్, స్పోక్స్ పర్సన్ అస్మా తస్లిమ్, నవీన్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాగా, సోమవారం కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.