JAISW News Telugu

CM Revanth : కార్పొరేట్ విద్యాసంస్థలను వేటాడుతున్న రేవంత్ సర్కార్.. కారణం అదే

CM Revanth

CM Revanth

CM Revanth : గతంలో చదువుకునేవారు. కానీ ఇప్పుడు చదువుకొంటున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల మోతకు తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. శిశు తరగతికి కూడా రూ. 30 వేల ఫీజు తీసుకుంటున్నారంటే ఎంత మొత్తంలో బాదుతున్నారో అర్ధమవుతోంది. ఇలా ఫీజులు అధిక మొత్తంలో లాగుతుండటంతో మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిపై సర్కారు కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీల ఆగడాలను నియంత్రించేందుకు కొత్తగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. ఎన్నికల అనంతరం శాసనసభలో దీనికి సంబంధించిన బిల్లు తీసుకురావాలని యోచిస్తోంది. ప్రైవేటు కాలేజీలను నియంత్రించేందుకు సరైన చట్టం రూపొందించే పనుల్లో పడింది.

ఫీజుల మోతతో అందరిలో ఆందోళన నెలకొంది. ఇబ్బడిముబ్బడిగా ఫీజుల భారం పడుతుండడంతో సామాన్యుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో అధిక ఫీజులు తీసుకుంటున్నారని గతంలో ఫిర్యాదులు అందాయి. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కార్పొరేట్ విద్యా సంస్థల నియంత్రణకు చర్యలు తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.

కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. ఫీజులు చెల్లించలేక నానా తంటాలు పడాల్సి వస్తోంది. రూ. వేలల్లో ఫీజులు ఉండటంతో వాటిని చెల్లించే స్థోమత లేక సతమతమవుతున్నారు. మధ్య తరగతి వారికైతే ఫీజుల భారం సమస్యలు కలిగిస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను నియంత్రించాలని ప్లాన్ చేస్తోంది.

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఫీజులు కొండెక్కికూర్చున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల భరతం పడతామని చెబుతున్న సందర్భంలో మల్లారెడ్డి కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మల్లారెడ్డి కాంగ్రెస్ కు టచ్ లో ఉండటమే శిరోధార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేస్తారో చూడాల్సిందే మరి.

Exit mobile version