JAISW News Telugu

CM Revanth : వెనక్కి తగ్గిన సీఎం రేవంత్.. తాను అనుకున్న వాటిలో ఒక్కటే చేయకతప్పట్లే..

CM Revanth

CM Revanth and KCR

CM Revanth : తెలంగాణపై కేసీఆర్ ముద్ర అసలే ఉండకూడదని తాజా సీఎం రేవంత్ గట్టిగా ఫిక్సయ్యారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రను చెరిపివేయకుంటే..కేసీఆర్ ఇమేజ్ ను జనాల్లో తగ్గించకుంటే అది తనకు ఎప్పుడూ ముప్పుగానే ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అయితే అందులో ఒక్కటి మాత్రమే ప్రస్తుతం చేయగలుగుతున్నారు. ఆ ఒక్క నిర్ణయాన్ని కూడా కేసీఆర్ వ్యతిరేకించరు కాబట్టి చేయగలుగుతున్నారు. అదే తెలంగాణ అధికారిక గీతం జయ జయహే తెలంగాణ..దీన్ని కేసీఆర్ వ్యతిరేకించరు.. ఎందుకంటే ఆ గీతాన్ని ఆయన హయాంలోనే రాష్ట్రీయ గీతం చేయలేదు కాబట్టి..ఆ విషయంలో కేసీఆర్ సైలంట్ గా ఉంటున్నారు.

ఇక మిగతా నిర్ణయాలైన అధికారిక చిహ్నంలో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను మాత్రం బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చార్మినార్ వద్ద కేటీఆర్, కాకతీయ కళాతోరణం వద్ద వరంగల్ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం..రాజముద్ర సైతం కేసీఆర్ పాలనలో రూపొందించినవే. అందుకే కేసీఆర్ కు, బీఆర్ఎస్ శ్రేణులకు విపరీతమైన కోపం వచ్చింది.

అందుకే రేవంత్ రెడ్డి ఈ రెండు విషయాలపై ముందుకు వెళ్లలేకపోతున్నారు.  మూడింటిలో మార్పు చేసి సోనియా గాంధీతో కొత్తగా ఆవిష్కరిద్దామంటే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. మొండిగా ముందుకెళ్తామంటే బీఆర్ఎస్ మరింత ఆందోళనలు రేకిత్తించితే..తెలంగాణ అంతా నిరసన జ్వాలలు రేగితే ఎలా అనుకున్నారో ఏమో ప్రస్తుతానికి ఆ రెండింటి మార్పులు జోలికి వెళ్లకుండా ఒక్క రాష్ట్ర అధికార గీతాన్ని మాత్రమే జూన్ 2 న ఆవిష్కరించనున్నారు. దీనికి కేసీఆర్ నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదు.

ఎందుకంటే కేసీఆర్ హయాంలో ఎంతో మంది ఆంధ్రా వ్యక్తులకు, తమిళ వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చారు కాబట్టి.. కీరవాణి విషయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే సాధారణ జనం, తెలంగాణ కళాకారుల  నుంచి మాత్రం కీరవాణి మ్యూజిక్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కీరవాణి మ్యూజిక్ ఇస్తే అది సినిమా పాటలాగే ఉంటుంది తప్పా..తెలంగాణ ఆత్మ ఉంటుందో ఉండదో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి కీరవాణి స్వరకల్పనలో ఆ పాట ఎలా ఉండబోతుందో.

Exit mobile version