Vemulawada : వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
Vemulawada : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా సీఎం శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ క్రమంలో ఆలయ సమీపంలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. వేములవాడలో రూ.127.65 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతోంది. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయనున్నారు. నేతన్నల కోసం రూ.50 కోట్లతో నూలు బ్యాంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.