JAISW News Telugu

CM Revanth Wife : సీఎం రేవంత్ భార్య పెద్దగా బయటికి రావట్లేదేం..?

CM Revanth Wife

CM Revanth reddy Wife

CM Revanth Wife : ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మామూలు విషయం కాదు కదా.. అలాంటిది ఆ ఫ్యామిలీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా సీఎం సతీమణికి అయితే అబ్బో.. ఆ రాచ మర్యాదలకు కొదువే ఉండదు.. రేంజ్ ఊహకందదు. తెలుగు రాష్ట్రాలతో పాటు మన ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సతీమణులను ఎన్నిసార్లు టీవీ ఛానెల్స్, బుల్లి తెరలపై చూసి ఉంటామో లెక్కే ఉండదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్రకు ఒకప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణులు ఎన్ని సార్లు వార్తల్లో నిలిచారో చెప్పక్కర్లేదు. అంతేకాదు.. వారి పేర్లు కూడా మార్మోగడంతో ఎక్కడలేని ఫేమస్ అయ్యారు. ఎక్కడ చూసినా కేజ్రీవాల్ భార్య, ఫడ్నవిస్ సతీమణి అంటూ సోషల్ మీడియాలో, వార్తా.. ఎంటర్‌టైన్మెంట్ చానెల్స్‌లో కనిపించారు. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత మాత్రం ఎక్కడా కనిపించట్లేదు.. ఆమె గొంతు కూడా కనీసం వినిపంచట్లేదు. ఎందుకు ఇలా అంటూ నెటిజన్లు, తెలంగాణ ప్రజలు అందరూ చర్చించుకుంటున్నారు.

నో.. నో.. నో.. అంతే!
సీఎంను ఇంటర్వ్యూ చేయడం సాధ్యం కాకపోవచ్చని.. కనీసం రేవంత్ భార్యను ఇంటర్వ్యూ చేయాలని మెయిన్ స్ట్రీమ్ మీడియా, దినపత్రికల యాజమాన్యం.. మరోవైపు ఎంటర్‌టైన్మెంట్ చానెల్స్ క్యూ కట్టాయట. ‘ఒక్క పది నిమిషాలు మేడమ్.. కనీసం 5 నిమిషాలు అయినా మాట్లాడండి’ అని బతిమలాడినా నో.. నో అనే మాట తప్ప ఎస్ అని అస్సలు రాలేదట. కనీసం తమ చానెల్స్‌లో ప్రోగ్రామ్స్‌కు ముఖ్య అతిథిగా అయినా హాజరు కావాలంటూ విన్నపాలు వినిపించారట. అయినా సరే ఎక్కడికి రాను.. కనిపించను, వినిపించను అని చెప్పేశారట. ఎందుకంటే.. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు, రాజ్‌భవన్‌కు, ఇంటికి వచ్చే అతిథి మర్యాదల విషయంలో మాత్రమే బయటికి వచ్చి మీడియా కనిపిస్తున్నారు గీత. నేతల ఇంట్లో జరిగే శుభకార్యాలు, రాజ్‌భవన్ వెళ్లేప్పుడు మాత్రమే రేవంత్ తన వెంట గీతను తీసుకెళ్తున్నారు. అయితే.. మిగిలిన సందర్భాల్లో ఆమె పాల్గొనకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయట.

ఇందుకే రావట్లేదు బాస్!
ఒక గ్రామ సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రి.. కుటుంబ సభ్యులే అలా చేశారు.. ఇలా చేశారంటూ చిన్న చిన్న విషయాల్లో వార్తల్లో నిలుస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది సీఎం సతీమణి హైలైట్ అవ్వడం.. నలుగరి నోళ్లలో నానడం, వార్తల్లో నిలవడం అంత మంచిది కాదన్నది రేవంత్, గీత ఆలోచనట. అంతేకాదు.. ముఖ్యమంత్రి భార్య హోదాతో వచ్చే ఎలాంటి గౌరవ మర్యాదలు తనకు ప్రత్యేకంగా వద్దని కూడా చెప్పేశారట. అందుకే హడావుడికి దూరంగా ఉండాలని సీఎం సతీమణి ఫిక్స్ అయ్యారట. ఇక రేవంత్ రెడ్డి కూడా.. ఇదిగో సీఎం భార్య ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.. సీఎం కంటే ఆమె హైలెట్ అవుతున్నారనే వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా ముందుచూపుగా వ్యవహరిస్తున్నారట. ఇందుకే గీత ఎక్కడా కనిపించట్లేదు.. కనీసం వాయిస్ కూడా వినిపించట్లేదట. ఎంతైనా గీత, రేవంత్ నిర్ణయం అదిరిపోయింది కదూ.. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ వీరాభిమానులు ‘వావ్.. ఏం ఆలోచన వదినమ్మా..’ ‘సీఎం సతీమణా మజాకా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version