CM Revanth Reddy : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరిదని అన్నారు.
‘‘సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తాం. అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సైౌకర్యాలు కల్పించడం మా బాధ్యత. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఈ యాత్ర ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నా. మానవ సేవే మాధవ సేవ సూక్తితో మా ప్రభుత్వం పని చేస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.