JAISW News Telugu

Revanth Reddy:టీఎస్‌పీఎస్సీ లీకేజీల‌పై సీఎం కూపీ లాగుతున్నారా?

Revanth Reddy:తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ నిర్వ‌హించిన ప‌రీక్షా ప‌త్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివ‌రాలు, కేసు పురోగ‌తిని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకున్నారు. టఎస్‌పీఎస్సీపై మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో సీఎం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, డీజీపీ ర‌విగుప్తా, పోలీసులు ఉన్న‌తాధికారులు, క‌మీష‌న్ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్ త‌దిత‌రులు స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు నియామ‌కాలు, చైర్మ‌న్ స‌హా స‌భ్యుల నియామ‌కానికి సంబంధించిన అర్హ‌త‌లు, ఇత‌ర అంశాల‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. క‌మీష‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన నియామ‌కాలు, మిగిలిన నియామ‌కాల ప్ర‌స్తుత ప‌రిస్థితి, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, సంబంధిత అధికారుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ 1, ఏఈఈ త‌దిత‌ర ప‌రీక్ష‌ల ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంపై సీఎం అడిగి తెలుసుకున్నారు.

కేసు పురోగ‌తి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌, త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ స‌హా అన్ని అంశాల గురించి పోలీసు ఉన్న‌తాధికారుల ద్వారా వివ‌రాలు తీసుకున్నారు. ఇత‌ర ప‌రీక్ష‌ల తేదీలు, నిర్వ‌హ‌ణ అంశం కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా క‌మిష‌న్ త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

Exit mobile version