Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరితో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి భేటీ
Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం అందు తుంది. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారు ల ను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయా లని కేంద్ర మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్- శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు-కల్వకుర్తి రహదారి నీ నాలు గు వరుసల గా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR)దక్షిణ భాగం అభివృద్ధి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరువరు సల విస్తరించడం పై గడ్కరీ తో రేవంత్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నారు.
Central Road & Infrastructure Fund (CRIF) నుండి తెలంగాణ కు నిధుల కేటాయింపు పెం చాలనీ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయా లని,నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.