JAISW News Telugu

DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: డీకే అరుణ

FacebookXLinkedinWhatsapp
DK Aruna

DK Aruna

DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడల్లా తనని అవమానించేలా మాట్లాడుతున్నారని, సీఎం  స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీలను ఎక్కడా ప్రస్తావించడం లేదని, మళ్లీ ఓట్ల కోసం కొత్త కొత్త మాటలతో మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారని అరుణ ఆరోపించారు. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా నెరవేర్చ లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అరుణ పేర్కొన్నారు.

‘‘60 ఏళ్లుగా నా కుటుంబం ప్రజాసేవలో ఉంది. తండ్రిని, సోదరుడిని కోల్పోయినా వెనక్కి తగ్గలేదు. మహబూబ్ నగర్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నీరందేలా డీపీఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తే.. కేంద్రం నుంచి పాలమూరు-రంగారెడ్డికి నిధులు తీసుకొస్తా. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మెగా డీఎస్సీ ఏమైంది..? టెట్, డీఎస్సీ రుసుములు ఎందుకు పెంచారు..? అని డీకే అరుణ ప్రశ్నల వర్షం కురిపించారు.

Exit mobile version