Revanth Reddy:ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి..ఆ ఆరుగురు మంత్రులెవరో?
Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. వివిధ కీలక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై ఆరా తీస్తూ వివిధ శాఖలకు సంబంధించిన ఛైర్మన్‌ల నియామకాలని ఇటీవల రద్దు చేయడం, టీఎస్‌పీఎస్సీపై సమీక్ష నిర్వహించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం, వారంతా ఇటీవల బాధ్యలు స్వీకరించడం తెలిసిందే. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు వంటి లీడర్లు రేవంత్ మంత్రి వర్గంలో కొలువుదీరారు.
వీరితో పాటు మరో ఆరు గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఆ మదవులు ఎవరిని వరించనున్నాయి? ఎవరెవరు మంత్రి పదవుల కోసం పోటీపడుతున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరు మంత్రి పదవుల కోసం 15 మంది ఆశావాహులు పోటీపడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరుగురు మంత్రులపై క్లారిటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారని తెలిసింది. మిగిలిన మంత్రుల జాబితాపై ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చలు జరపనున్నారని, ఆ విషయంలో క్లారిటీ కోసమే రేవంత్ ఢిల్లీ వెళుతున్నారని తెలిసింది.