JAISW News Telugu

CM Revanth Reddy : మోడీని గాడ్సెతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెంచారు. ప్రధాని నరేంద్ర మోడీని నాథూరామ్ గాడ్సేతో పోల్చుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “మోడీ ఈ దేశంలో గాడ్సే విధానాలను ప్రేరేపిస్తున్నాడు. దేశాన్ని విభజించే విధానాలను ప్రోత్సహిస్తున్నాడు. మనం అందరం కలిసి గాడ్సే లాంటి మోడీకి వ్యతిరేకంగా పోరాడాలి” అని రేవంత్ పిలుపునిచ్చారు.మోడీ పాలనలో మత విద్వేషాలు పెరిగాయని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలంతా చైతన్యవంతంగా ఉండాలని, గాడ్సే ఆలోచనలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో చూడాలి.

Exit mobile version