CM Revanth – Governor : గవర్నర్ తో సీఎం రేవంత్ భేటీ

CM Revanth – Governor
CM Revanth – Governor : హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ తో రేవంత్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని బిల్లులపై గవర్నర్ తో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పెండింగ్ అంశంపై కూడా గవర్నర్ తో చర్చించే అవకాశముంది. కేబెనెట్ విస్తరణ గురించి చర్చిస్తారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ, తెలంగాణ ఉమ్మడి ఆస్తులపై రేవంత్ గవర్నర్ తో చర్చించే అవకాశం ఉంది.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి గత మూడు రోజులుగా కాంగ్రెస్ పెద్దలతో పాటు, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించారు. అవే అంశాలపై ఈరోజు గవర్నర్ తో సీఎం చర్చించే అవకాశం ఉంది.