CM Revanth – PM Modi : నేడు పీఎం మోదీతో సీఎం రేవంత్ భేటీ!

CM Revanth - PM Modi

CM Revanth – PM Modi

CM Revanth – PM Modi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నట్లు సమాచారం. త్వరలో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రేవంత్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సీఎం వెంట ఉండనున్నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో సీఎం భేటీ కానున్నారు.

TAGS