MLA Prakash Goud : సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం ప్రకాష్ గౌడ్ అనుచరులతో పాటు మునిసిపల్ చైర్మన్, కార్పొరేటర్లు, ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, పోచారం శ్రీనివాస రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జడ్పీ ఛైర్మన్ పీఠాలు, మునిసిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమయ్యాయి. జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.