JAISW News Telugu

CM Revanth Reddy: ఖమ్మం వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్.. మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

CM Revanth Reddy: భారీ వర్షాలతో అతలాకుతలమైన ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర వరద ఉధృతితో ఖమ్మం-సూర్యపేట జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన బ్రిడ్జిని సీఎం, మంత్రులు పరిశీలించారు. పాలేరు రిజర్వాయర్ ను కూడా పరిశీలించారు. భారీ వర్షాలకు ఈరోజు (సెప్టెంబర్ 2న) ఉదయం పాలేరు బ్రిడ్జి తెగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సీఎం రేవంత్ ఈరోజు ఖమ్మంలోనే బస చేయనున్నారు.

ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రభావిత మృతులకు ఎక్స్ గ్రేషియా రూ.4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వదరలకు ఇళ్లు కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Exit mobile version