CM Revanth – Chiranjeevi : భారత ప్రభుత్వం అందించే అవార్డుల్లో అత్యుత్తమమైన పురస్కారాలు పద్మ పురస్కారాలు. ప్రతీ ఏటా గణతంత్ర వేడుకల తర్వాత ఈ పురస్కాలను కేంద్రం ప్రకటిస్తుంది. ఈ సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ ప్రకటించారని తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్, తెలుగు ప్రజలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ కు పద్మ విభూషణ్ ప్రకటించడంతో రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు చెప్తున్నారు. దీంతో పాటు సినిమా, రాజకీయ నేపథ్యం ఉన్న దాదాపుగా అందరూ ఆయనను స్వయంగా కలిసి సన్మానిస్తున్నారు. పద్మ విభూషణ్ ప్రకటించినప్పటి నుంచి మెగాస్టార్ పేరు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోతోంది.
ఈ పురస్కారంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీనికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రెటీలు వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరై సందడి చేశారు. ముందుగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వీళ్లు చాలా సేపు ముచ్చటిస్తూ కనిపించారు.
అవార్డు ప్రకటించిన సందర్భంగా సీఎం సోషల్ మీడియాలో ‘శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చెప్పారు. దీనికి బదులుగా మెగాస్టార్ ‘నన్ను అభినందించిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు’ అని పోస్ట్ పేట్టారు. ఈ విషయాన్ని సీఎంవో ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో తెలిపింది. దీంతో పాటు ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు శ్రీ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.
అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేసిన శ్రీ చిరంజీవి.
విందుకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన సీఎం.
శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ… pic.twitter.com/JhTzVZ6VEn
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2024