JAISW News Telugu

Revanth:ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో సీఎం సమావేశం..వారి గోడు విన్నారా?

Revanth:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మహాలక్ష్మీ పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం మహిళలకు ఉపయోగకరంగా ఉన్నా.. ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లకు మాత్రం గొడ్డలిపెట్టుగా మారింది. ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఉచిత బస్సు సౌకర్యంతో ప్రభుత్వం.. తమ జీవనోపాధిని దెబ్బ తీస్తుందని.. తమ పొట్ట కొట్టదంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందిస్తూ ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలిపింది.

తాజాగా శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ అయ్యారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి వీరు విజ్ఒప్తి చేయడంతో..ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, మాణిక్ థాక్రే పాల్గొన్నారు.

Exit mobile version