Mamata Banerjee : సీఎం మమతా బెనర్జీ సోదరుడి ఓటు గల్లంతు

Mamata Banerjee
Mamata Banerjee : తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ సోదరుడికి అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఓటరు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన అవాక్కయ్యారు. జాబితాలో తన పేరు గల్లంతు కావడంతో ఓటుహక్కును వినియోగాంచుకో లేకపోయారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీకి హావ్ డా ప్రాంతంలో ఓటు ఉంది. ఐదో విడతలో భాగంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయనకు తన ఓటు గల్లంతయిందన్న విషయం తెలిసింది. దీనపై ఆయనను మీడియా ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఏం జరిగిందనే దానిపై అదే వివరణ ఇస్తుందని పేర్కొంది.
హావ్ డా నుంచి తృణమూల్ తరపున మరోసారి ప్రసూన్ బెనర్జీకి టికెట్ ఇవ్వడంపై బబున్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మమత, ఆమె సోదరుడి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.