Big Breaking:తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధిస్తోంది. పార్టీ అభ్యర్థులు అత్యధక శాతం విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టడం ఇక లాంఛనమే. అదే సమయంలో అధికార బీ ఆర్ ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో అభ్యర్థులు విజయం సాధించకపోవడంతో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా మారింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు కూడా పరాజం పాలు కావడంతో తెలంగాణలో అధికారం చేతుల మారడం ఖాయం అయింది. గత రెండు దఫాలుగా అధికారాన్ని చేపట్టిన బీఆర్ ఎస్ ఈ దఫా ప్రతి పక్షంలో కూర్చోబోతోంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రజల తీర్పుని గౌరవిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా సమర్పించడానికి రాజ్ భవన్‌కు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రజలు మార్పుని కోరుకోవడం, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుండటం, అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడమే కాకుండా మరి కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్న సందర్భంగా రాజ్ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా సమర్పించారు.