JAISW News Telugu

CM Jagan : ఐదేండ్లలో ఏం చేశారని..? వచ్చే టర్మ్ లో చేస్తామంటే జనాలు నమ్ముతారా?

CM Jagan

CM Jagan

CM Jagan : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో అధినేతలు అందరూ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఒక్క క్షణం కూడా తీరికగా ఉండడం లేదు. అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయడానికి సతీమణులు సైతం రంగంలో దిగుతున్నారు. అలాగే అధినేతల తరుఫున కుటుంబ సభ్యులందరూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇలా ఏపీలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ప్రజల్లో ప్రత్యక్షంగా ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

నిన్న కడప జిల్లా మైదుకూరులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామరెడ్డి తరఫున జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో జగన్ మాట్లాడిన మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఎవరైనా ఎన్నికలలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పుకుని ప్రజలను ఓట్లు అడుగుతుంటారు. కానీ జగన్ మాత్రం ‘రాజోలు ప్రాజెక్టుకు మేము శంకుస్థాపన చేశాం. కానీ కరోనా వల్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల పూర్తి చేయలేకపోయాం.. మళ్లీ మమ్మల్ని గెలిపిస్తే వచ్చే టర్మ్ లో తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయకుండా మళ్లీ గెలిపిస్తే తప్పకుండా పూర్తి చేస్తామని చెబితే ప్రజలు నమ్ముతారా?

ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..‘‘గత నాలుగేళ్లుగా భారీ వర్షాలు పడడం వల్ల ప్రాజెక్టులన్నీ నిండాయి. కనుక అప్పుడు రాజోలు ప్రాజెక్టు అవసరం.. ప్రాముఖ్యత మేము గుర్తించలేకపోయాం.. కానీ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో దాని విలువ, అవసరం తెలుసుకున్నాం..’’ అన్నారు.  ఇంతకీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివ్యంగా చెప్పడం అబద్ధమనుకోవాలా లేక ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడం అబద్ధమనుకోవాలా? జగన్ ప్రభుత్వం  ఐదేళ్లుగా అభివృద్ధి పనులను పట్టించుకోకుండా సంక్షేమ పథకాలతో వైసీపీ ఓటు బ్యాంకు పెంచుకోవడంపైనే దృష్టి పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పనులు ఎన్నో అర్థంతరంగా నిలిచిపోయాయి. అందుకు పూర్తి బాధ్యత వహించాల్సిన సీఎం జగన్ ప్రకృతిని, కరోనాను సాకుగా చూపడాన్ని ఏమనుకోవాలి?. ఇది ప్రజలు గమనించడం లేదని అనుకుంటే జగన్ అవివేకమే అనుకోవాలి. రాబోయే ఎన్నికల్లో జనాలు సరైన నిర్ణయం తీసుకోబుతున్నారు.

Exit mobile version