JAISW News Telugu

Sharmila Arrest : చెల్లి షర్మిలను అరెస్ట్ చేయించిన సీఎం జగన్

Sharmila Arrest

Sharmila Arrest

Sharmila arrest : సీఎం జగన్ ప్రతిపక్షాలను, మీడియాను సైతం వదలడం లేదు. ప్రశ్నించిన నేతలను అరెస్ట్ చేయడమే కాదు ప్రభుత్వ పాలన తీరుపై కథనాలు రాసిన పత్రికలు, చానెళ్లపై కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలను ఇష్టారీతిన ట్రోల్ చేసే వైసీపీ కార్యకర్తలు, వారి పాలన తీరుపై ప్రశ్నిస్తే మాత్రం దాడులు చేయడం గమనార్హం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కనుమరుగై పోయాయి. ఎన్నికల వేళ డీఎస్సీ, గ్రూప్ 1,2 లంటూ నోటిఫికేషన్లు వేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి 6వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఇది దగా డీఎస్సీ అంటూ నిరసనలు తెలుపుతున్నాయి.

తాజాగా ఈవిషయమై నిలదీసిన సొంత చెల్లి వైఎస్ షర్మిలను సీఎం జగన్ అరెస్ట్ చేయించారు. మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు.

అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు.. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనం ఎక్కించారు. ఈక్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Exit mobile version