Fishermen Awaits For CM Jagan : సీఎం జగన్ వచ్చే వరకు కదలం.. విశాఖ ఫిషింగ్ హర్బర్ ఘటనపై మత్స్య కారుల పట్టు.. ప్రమాద కారకుడిని పట్టుకున్న పోలీసులు
Fishermen Awaits For CM Jagan : ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలోని షిప్పింగ్ హర్బర్ లో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భారీ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 40కి పైగా మరబోట్లు కాలి బూడిదయ్యాయి. 11.30 గంటలు దాటిన తర్వాత జీరో నెంబర్ జట్టీలో మంటలు అంటుకున్నాయి. ఇవి కాస్తా క్షణాల్లోనే ఇతర బోట్లకు వ్యాపించాయి. అయితే అదృష్ట వశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం రూ. 30 కోట్ల మేర ఉంటుందని మత్స్య కారులు చెప్తున్నారు. అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై మత్య్స కారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ గేట్ వద్ద భారీ ఎత్తున నిరసన తెలిపారు. బోట్లు దగ్ధమైన ప్రమాద స్థలానికి సీఎం జగన్ రావాలని, తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సముద్రంలో చేపల వేట గురించి చిత్రీకరించేందుకు వచ్చిన ఓ యూ ట్యూబర్ ఇచ్చిన మద్యం పార్టీతో ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్తున్నారు. మద్యం మత్తులో ఏపీకి సంబంధించిన రెండు పార్టీల గురుంచి ప్రస్తావన రావడంతో భారీగా రాడ్లు, కట్టెలతో యువకులు దాడులు చేసుకున్నారు.
కొంత కాలంగా రెండు వర్గాలుగా విడిపోయిన మత్స్య కారులు ఫిషింగ్ హార్బర్ లో తల్వార్లు, కత్తులతో పరస్పరం దాటి చేసుకుంటున్నారు. ఫిషింగ్ హార్బర్ లో ఎలాంటి నిఘా వ్యవస్థ లేకపోవడంతో దాడులు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయని మత్స్య కారులు చెప్తున్నారు. అయితే ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో అనుమానితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ప్రస్తుతం సదరు యూ ట్యూబర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.