CM Chandrababu : ఈరోజు (గురువారం) ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనకు బయల్దేరారు. ముందుగా ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక. 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందం పొందిన జగన్. జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక అని, ఆ శిథిలాలను తొలగించం అని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఉద్దండరాయుని భూమిపూజ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. ఈ క్రమంలో నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయనున్నారు.
కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం రాజధాని అమరావతిని సందర్శిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టకముందు నుంచే అధికారులు ఇక్కడ పనులు చేపడుతున్నారు.