CM Chandrababu : గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, హాస్టళ్ల మెరుగుదలపై సీఎ చంద్రబాబు ఉన్నతాధికారులతో చర్చించారు. గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఇక నుంచి డోలీ మోతలు కనిపించకూడదని సీఎం ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించారు. గిరిజన హాస్టళ్లలోని పరిస్థితులపై ఏపీ ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయని ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

గిరిజన మహిళలు, పిల్లలకు పౌష్ఠికాహారం అందజేతపై సమీక్షించిన చంద్రబాబు, అంగన్ వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనపై సమీక్షలో చర్చకు వచ్చినట్లు సమాచారం. గిరిజన ప్రజలకు విద్య పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సమీక్షించారు.

TAGS