JAISW News Telugu

CM Chandrababu : పింఛన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. ‘‘ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో గెలిపించారో.. వాటిని నెరవేర్చడమే తక్షణ కర్తవం. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ. వెయ్యి పెంచి ఇస్తున్నాం.

దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేల ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచి పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తున్నాం. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుంది.

నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల సమయంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూశా. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నాం’’ అని లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version