CM Chandrababu – CM Revanth : తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఏపీ సాలెం చంద్రబాబునాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. దానికి రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు. దీనిపై మంగళవారం లిఖితపూర్వకంగా తన స్పందన తెలియజేయనున్నారు.
ప్రజా భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఉన్నది. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో ఉన్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి.