CM Chandrababu : దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రికి చేరుకొని దుర్గమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం అనంతరం మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.
చంద్రబాబు సీఎంగా విజయవాడకు వచ్చిన సందర్భంగా తొలిసారి గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రి దర్శనం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసానికి బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.