CM Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Tirumala
CM Chandrababu : తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ రంగనాయక మంటపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల నుంచి బయలుదేరి కాసేపట్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని, ఉండవల్లిలోని నివాసానికి వెళతారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలు చేపడతారు. మొదటగా ఐదు ఫైళ్లపైన సీఎం చంద్రబాబు సంతకాలు చేస్తారు.