CM Chandrababu : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సతీమణి భువనేశ్వరి, మత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ లు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, దర్శనం చేసుకున్నారు. సీఎం ఆలయానికి వచ్చినా, సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.