CM Chandrababu : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మరియు ఆయన కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తారు. మధ్యాహ్నం తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు సీఎం చంద్రబాబుకు లాంఛనంగా స్వాగతం పలికారు.