JAISW News Telugu

CM Chandrababu : కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణుల సమస్యలపై దృష్టి సారించారు. ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు. అదే రోజున ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా తెలిపారు. అంతేకాకుండా, ఇన్‌ఛార్జ్‌ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో నెలకు కనీసం రెండు రోజులైనా తప్పనిసరిగా పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు.

Exit mobile version