CM Chandrababu : పార్లమెంట్ లో వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
CM Chandrababu : ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పోటీపడి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్టమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు రావలసిన నిధులపై భేటీలో చర్చించారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్, అతని పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్టు తెలుస్తోంది. జగన్ గురించి ఆలోచించే సమయాన్ని కూడా రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాలని ఓ మంత్రి అన్నట్లు సమాచారం. ఢిల్లీలో జగనేం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.