JAISW News Telugu

 Unstoppable 4 -NBK : అన్‌స్టాపబుల్‌ సీజన్ ఫోర్‌లో ఫస్ట్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Unstoppable 4 season

Unstoppable 4 season

Unstoppable 4 -NBK : ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌  షో విజయవంతంగా 3 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులకు ఆసక్తికర ప్రశ్నలు వేసి బాలకృష్ణ అభిమానులను ఫిదా చేశారు. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 4 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దసరా పండుగ సందర్భంగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 అప్‌డేట్‌ను షో నిర్వాహకులు అందించారు. ఇందులో భాగంగా 4 నిమిషాల నిడివిగల యానిమేషన్ ట్రైలర్ ను విడుదల చేశారు. కానీ ఈ ట్రైలర్‌లో బాలకృష్ణ సూపర్‌హీరోగా కనిపించారు. కన్నెర్ర చేస్తే ప్రళయం.. మీసం తిప్పితే శతృవుకి మరణం.. ఆయన మాట శాసనం అంటూ  ఎలివేషన్స్ ఇస్తూ యానిమేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జనరేషన్ మారినా మన ఎమోషన్స్ మారవు, అలాగే మన దెబ్బకు థింకింగ్ మారాలి అంటూ బాలకృష్ణ ఎమోషనల్ డైలాగ్స్ ట్రైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. అన్ స్టాపబుల్ సీజన్ 4లో ప్రశ్నలు మరింత ఘాటుగా ఉంటాయని, ఆన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు అన్ స్టాపబుల్ సీజన్ 4 సిద్ధమైందని బాలకృష్ణ తెలిపారు. అలాగే అన్ స్టాపబుల్ సీజన్ 4ని అక్టోబర్ 24న గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు బాలయ్య పుష్పగుచ్ఛం అందించి సెట్‌కి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ షోలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడం ఇది రెండోసారి.  అన్ స్టాపబుల్ సీజన్ 3లో పాల్గొని ప్రేక్షకులను అలరించాడు. వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు బయటపడ్డాయి. ఆ ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 25 నుంచి కొత్త సీజన్ ప్రసారం కానుందని తెలుస్తోంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాల్లో సంచలన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు రాకతో ఈ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Exit mobile version